National News Networks

కేంద్ర బడ్జెట్‌తో ఒరిగిందే లేదు

Post top
  • తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ…
  • ప్రజల ఆశీస్సులతో కెసిఆర్‌ అద్భుత పాలన
  • అభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలి..
  • మేడ్చెల్‌ ‌పర్యటనలో పలు కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీ‌కారం…
  • పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‌విమ ర్శించారు. ఏ ఒక్కరంగానికి రూపాయి కేటాయిం చలేదన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. బడ్జెట్‌తో పేదలకు ప్రయో జనం లేదన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బ్జడెట్‌లో పేదలకు పనికొచ్చేది ఏదీ లేదని, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొం డిచేయి చూపెట్టారని మంత్రి విమర్శించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా… అన్నింటిని బుట్ట దాఖలు చేశారని అన్నారు. కేంద్రం ఇచ్చినా… ఇవ్వక పోయినా…ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పాలనలో….తెలంగాణ రాష్ట్రం ఇదే రీతిలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఆగవన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పర్యటనలో మంత్రి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌ ‌నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌, ‌పీర్జాది గూడ, బోడుప్పల్‌ ‌కార్పొరేషన్‌లో పర్యటించిన కేటీఆర్‌… ‌మంత్రి మల్లారెడ్డితో కలిసి 303 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జవహర్‌ ‌నగర్‌ ‌ప్రాంత వాసుల చెత్త సమస్యను పరిష్కరించామని….147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాపింగ్‌ ‌చేశామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. మేడ్చల్‌ ‌నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌, ‌పీర్జాదిగూడ, బోడుప్పల్‌ ‌మున్సిపాలిటీల్లో పర్యటించిన మంత్రి… మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బోడుప్పల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లోని చంగిచెర్లలో 110 కోట్లతో చేపట్టనున్న ఎస్‌ఎన్‌డీపీ పనులకు శంకుస్థాపన చేశారు. బొడుప్పల్‌లో ఎఫ్‌ఎస్‌టీపీ సెంటర్‌ను…మేడిపల్లిలో వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు.

జవహర్‌ ‌నగర్‌ ‌ప్రాంత పరిధిలో 250 కోట్ల రూపాయలతో మురికినీటిని శుద్ధి చేసే పనులూ జరుగుతున్నాయని వెల్లడించారు. జవహర్‌నగర్‌లో చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నవారికి న్యాయం చేస్తామని హానిచ్చారు. జీవో 58,59 ద్వారా ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. డంపింగ్‌ ‌యార్డుల్లో రూ.147 కోట్లతో గ్రీన్‌ ‌క్యాపింగ్‌ ‌చేశామని పేర్కొన్నారు. చెరువులు కలుషితం కాకుండా రూ.250 కోట్లతో లిచింగ్‌ ‌చేశామన్నారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలించామని స్పష్టం చేశారు. మౌలిక వసతులకు కేంద్రం బ్జడెట్‌లో నిధులు ఇవ్వలేదన్న మంత్రి…కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవని తెలిపారు. మనఊరు-మనబడి కింద రూ.7289 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. కేంద్ర బ్జడెట్‌లో పేదలకు పనికొచ్చేది ఏదీ లేదు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపెట్టారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా..అన్నింటిని బుట్ట దాఖలు చేశారు. కేంద్రం ఇచ్చినా, ఇవ్వక పోయినా, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. మౌలిక వసతులకు కేంద్రం బ్జడెట్‌లో నిధులు ఇవ్వలేదు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవని మంత్రి కేటీ రామారావు అన్నారు.

శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు వందల కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించామని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వొస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు కానీ…గుజరాత్‌లో వరదలకు మాత్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం నిన్న బ్జడెట్‌ ‌ప్రవేశపెడితే ఏ వర్గానికి ప్రయోజనం కలిగేలా లేదని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. జవహర్‌ ‌నగర్‌ ‌ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి 58, 59 ద్వారా పట్టాలు ఇప్పిస్తామన్నారు. నెల రోజుల్లో 58, 59 జీవోలు తెస్తామన్నారు. డంప్‌ ‌యార్డ్ ‌సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్క మేడ్చల్‌ ‌నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరాకు రూ.240 కోట్లను ఖర్చు చేస్తున్నాం. 50వేల కనెక్షన్లను 1 రూపాయికే ఇస్తాం. రూ.308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నాం. పట్టణ ప్రగతిలో అనేక పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే మేడ్చల్‌లో మంత్రి కేటీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ‌చేశారు. జవహర్‌నగర్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో మంత్రి కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ ‌నేతలు అడ్డుకున్నారు. జవహర్‌నగర్‌లోని పేదలకు 58, 59 జీఓను తీసుకరావాలని, డంపింగ్‌ ‌యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను అరెస్ట్ ‌చేసి జవహర్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.