వీరులపాడు:ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు మరోసారి గడప గడపలో నిరసన సెగ తగిలింది. వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యే మొండితోకను డ్రైనేజీ సమస్య, ఫీజ్ రియంబర్స్మెంట్ రావడం లేదని ఒక విద్యార్థి నిలదీసాడు. దాంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయారు.
పక్కనే వున్న వైకాపా నేతలు రమేష్ ,ముత్తారెడ్డి కలగచేసుకునొ ఆ విద్యార్థిని ఎమ్మెల్యే నే ప్రశ్నిస్తావా ,నీకు పథకాలు ఎలా వస్తాయి అసలు ఎలా తిరుగుతావు అని బెదిరించారు. మొన్న పరిటాల,నిన్న కొడవటికల్లు ఇవాళ అల్లూరు ఇలా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అయనకు నిరసన సెగ తగులుతోంది.
