FOCUSTV Updated on: Oct 20, 2023 | 11:33 AM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 44 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడబోతోంది. హైకోర్టులో కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ.. ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17-ఏ. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అతడిని నియమించిన వ్యవస్థ అనుమతి తప్పనిసరి… అనేది ఈ సెక్షన్ సారాంశం. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాల్లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది.