సీఎం జగన్ ప్రకటించిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతున్నారు..ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ సిబ్బందితో కలిసి పార్టీ నాయకులు,కార్యకర్తలు వెళ్తున్నారు.ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలకు సిద్దమవుతుంది పార్టీ నాయకత్వం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు.
ప్రతి రోజూ ఉత్తరాంధ్ర,దక్షిణ కోస్తా,రాయలసీమ… ఇలా మూడు ప్రాంతాల్లోని ఏదో ఒక నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు…అక్టోబర్ 26 నుంచి విడతల వారీగా మొత్తం మూడు ప్రాంతాల్లోని 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టేలా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు వరుస సమావేశాలు పెడుతున్నారు. యాత్రలు సక్సెస్ చేసేందుకు రంగంలోకి దిగిన రీజినల్ కోఆర్డినేటర్లు సామాజిక బస్సు యాత్రలు అక్టోబర్ 26 నుంచి మొదలు పెట్టి డిసెంబర్ 31 వరకూ దాదాపు 60 రోజుల పైగా జరిగేలా కసరత్తు చేస్తున్నారు.మూడు ప్రాంతాల్లో మూడు టీమ్ లు బస్సు యాత్రల్లో పాల్గొంటాయి.