Telangana Assembly Election 2023: తెలంగాణలో రాజకీయ జాతర నడుస్తోంది. జాతర అంటే ఇంటికి చుట్టాలు వస్తారు కదా.. అలాగే పొలిటికల్ జాతరలోనూ చుట్టాలు క్యూకడుతున్నారు. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు జాతీయస్థాయి నేతలు ఒకరివెంట ఒకరు రాష్ట్రానికి వస్తున్నారు. భారీ ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు అన్ని పార్టీల నేతలు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు హోరెత్తే ప్రచారాలతో ఈ సారి ఎన్నికలు మునుపటి లెక్క ఉండవు అనే రేంజ్‌కి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూకడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈనెల 27న సూర్యాపేటలో అమిత్‌షా బహిరంగ సభ జరగనుంది. అమిత్ షా తర్వాత షెడ్యూల్ తర్వాత జేపీ నడ్డా కూడా పర్యటించనున్నారు.