భద్రాద్రి ఆలయ భూములపై వివాదం నెలకొంది..అల్లూరి జిల్లా పురుషోత్త పట్నంలో ఆలయ సిబ్బందికి .. స్థానికులకు మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి ఆలయ సిబ్బంది పై స్థానికులు దాడి చేయడం తో..వివాదం మరింత రాజుకుంది. భద్రాచలం సీతారాముల భూములపై వివాదం కంటిన్యూ అవుతుంది. పట్టణ శివారులోని స్వామి వారి భూముల్లో గోశాల నిర్మిస్తుండగా స్థానిక రైతులు అభ్యంతరం తెలిపారు. రామాలయం సిబ్బందిని అడ్డుకున్నారు పురుషోత్తపట్నం గ్రామస్థులు. దీంతో అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్త పట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.