ఏపీ వ్యాప్తంగా “జగనాసుర దహనం”
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా “దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం” అంటూ తెలుగుదేశం నిరసన తెలిపింది. సోమవారం రాత్రి 7 నుంచి 7గంటల 5 నిమిషాల వరకూ తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అభిమానులు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ…. తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యాక్రమంలో రాజమండ్రిలో లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వనచంద్రబాబు అరెస్టు కు నిరసనగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెంలో కర పత్రాలను మంటల్లో వేసి నిరసన తెలిపారు. అచ్చంపేటలో నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత దారితీసింది. తమపై ఎస్‌ఐ దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసు వాహనాన్ని మహిళలు అడ్డగించారు.