వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వేదికగా ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై కామెంట్ చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టిన మొదటి రోజు షర్మిలకు మాకూ ఏం సంబంధం లేదు అన్న వ్యక్తి నేడు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నేనైనే ఇప్పటి వరకూ సంబంధం లేదనే అనుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సజ్జలపై వ్యంగాస్త్రాలు సంధించారు. మన్న జరిగిన సభలో చీకటి అంటే ఆంధ్ర, వెలుగు అంటే తెలంగాణ.. సింగల్ రోడ్డు అంటే ఆంధ్ర, డబుల్ రోడ్డు అంటే తెలంగాణ అన్న దానిపై స్పందించాలని చురకలంటించారు. ముందు మీ పని మీరు సక్రమంగా చేసుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సజ్జల తిరిగి స్పందిస్తారా లేక వదిలేస్తారా వేచిచూడాలి.
Related Posts