PRASANTH AREM ; Edited By: KAKA SHIVA SHANKER
Updated on: Jul 10, 2023 | 6:44 PM
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ.. అధిష్టానానికి నమ్మిన బంటు..రాహుల్ గాంధీ తో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అడుగులో అడుగులు వేసి అగ్రనేత మన్ననలు పొందిన నాయకురాలు.. తాజాగా సీఎం పదవిపై పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారుతున్న నేపథ్యంలో ఆ మహిళా నేత ఎవరు..?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రెసులో ఉన్న నాయకురాలు ఆమేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రేవంత్ ఎమ్మెల్యే సీతక్క ని ప్రమోట్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికాలోని తానా వేదికగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే సీతక్కే మా సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అయితే, రేవంత్ మాటల వెనుక అంతర్యం ఏంటని చర్చించుకుంటున్నాయి. సీతక్క ఇమేజ్‌తో ఓట్లు రాబట్టాలని రేవంత్ భావిస్తున్నారని.. ఎస్టీ, మహిళా ఓట్లు లక్ష్యంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసారంటూ విశ్లేషిస్తున్నారు. గతంలో ఒక్కటే సీట్ ఉంటే ముందు సీతక్కకే ఇస్తా అని రేవంత్ చెప్పడం.. ఆ మధ్య కాలంలో వారి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు కూడా వచ్చాయి.. ఎన్నారై లు అడిగిన ప్రశ్నకు అవసరమైతే సీతక్కే సీఎం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం గాంధీ భవన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి అవుతారని రేవంత్
డైవర్షన్ పాలిటిక్స్ వాడారని చెబుతున్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ లతో పాటు మహిళలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కి అండగా ఉండేలా రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. సీతక్క కి ఉన్న ఇమేజ్ కాంగ్రెస్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని అటు అధికార పార్టీ, బీజేపీ నేతలు నేరుగా సీతక్క పై విమర్శలు చేసే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ లో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలకు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని భావిస్తున్నారు.