అక్కడే తేల్చుకుంటానంటూ సవాల్
శ్రీకాళహస్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడంపై ఆయన సిరియస్ అయ్యారు. శాంతియుతంగా ధర్నా చేస్తు ఎందుకు కొట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అలాగే జనసేన పార్టీపై ఇటీవల వైసీపీ నేతలను ఆరోపణలను కూడా పవన్ ఖండించారు. టీడీపీ పార్టీకి జనసేన బీ టీం అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే వాళ్ల ఆరోపణలను పవన్ కల్యాణ్ కొట్టి పారేశారు. మరోవైపు ప్రజలకు సేవ చేసేందుకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండగా.. మళ్లీ గ్రామ వాలంటీర్లు ఎందుకు అని ప్రశ్నించారు.