National News Networks

ఆపదలోఉన్నవారిని ఆదుకోవటం మా బాధ్యత.. ఢిల్లీ బాబు టిమ్

Post top
ఎక్కడున్నా ఢిల్లీ బాబు టిమ్ పని చేస్తుంది…
 ఆపదలోఉన్నవాళ్ళని ఆదుకొనుటమే మా లక్ష్యం.. 
ఆదివాసీ సంరక్షణ సమితి కన్వీనర్
కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) టిమ్ సభ్యులు 
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన లారీ ప్రమాదంలోప్రాణాపాయ స్థితిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలోచికిత్స పొందుతున్న రంపచోడవరం మండలం
పెదపాడు గ్రామానికి చెందిన కత్తుల రవితేజరెడ్డి (21) అదే గ్రామానికి చెందిన  ఎర్రగొండ రాజారావు {23) సోమవారం ఢిల్లీ బాబు టిమ్ సభ్యులు పరామర్శించి
ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు..

చికిత్స పొందుతున్నక్షతగాత్రులకు అత్యవసరంగా కావలసిన బి పాజిటివ్ రక్తాన్ని సమకూర్చడం జరిగింది. జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి కన్వీనర్ కారం సీతారామన్న దొర {ఢిల్లీ బాబు} వ్యక్తిగత పనిలో భాగంగా ఢిల్లీలో వున్నాఅయన ఆదేశాల మేరకు కాకినాడలోగల (డిల్లీ బాబు) టిమ్ సభ్యులు వెంటనే స్పందించారు,.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల రెండు కుటుంబాల సభ్యులకు వారికి కావలసిన అల్పాహారం,భోజనం,పళ్ళు,పాలు బ్రెడ్లు,సబ్బులు, వారికి కావాల్సిన వస్తువులు అందజేయడం జరిగింది..చికిత్స పొందుతున్నవారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించమని ఢిల్లీ బాబు ఫోన్ చేసి చెప్పారని, ఏ అవసరం వచ్చినా అండగా మేము ఉంటామని టీం సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా కత్తుల అబ్బాయి రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ బాబు రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మా బాగోగులు తెలుసుకుంటున్నారని, కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత తో ఢిల్లీ బాబు మాట్లాడి మెరుగయిన వైద్యం అందించాలని కోరారని, ఎప్పటికప్పుడు మా ఆరోగ్య పరిస్థితులు,మా బాగోగులు అడగితెలుసుకుంటున్నారని తెలిపారు.ఢిల్లీ బాబు టీం సభ్యులు జి. ప్రభుజార్జ్, వై.ఆశిక్, జి దుర్గాప్రసాద్, పి నాగరాజులకు క్షతగాత్రుల తల్లిదండ్రులు అభినందించారు..
 
Post bottom

Leave A Reply

Your email address will not be published.