మీ “అరేం”ను ఆశీర్వదించండి.
స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలోదూసుకుపోతున్న,,
ఆదివాసి “యువ” కెరటం“అరేం ప్రశాంత్”
ఆదివాసీ యువతకు,బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని,ఆదివాసి యువ ఉద్యమనేత అరేం ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గంలో రామన్నగూడెం యాత్ర ప్రారంభించారు. ములకలపల్లి మండలం నల్లకుంట పలు ప్రాంతాల్లో మీ”అరేం”ను ఆశీర్వదించండి”యాత్ర కొనసాగుతుంది.
ఈ సందర్భంగా అరేం ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ప్రతినిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సహాయం కోరిన ప్రతి ఒక్కరికి నా వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు.
ప్రజల ఆదేశాలు, నన్నునమ్మినా వెనుక నడుస్తున్న నా ఆదివాసి యువత,మద్దతు దారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని అరేం ప్రశాంత్ ప్రకటించారు.
Related Posts
ReplyForward
|