ఏపీ రాజకీయాల్లో సంచలనం..
SRD KARAM Updated on: Jul 09, 2023 | 5:31 PM
కాపు ఉద్యమనేత ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా..?
వైసీపీలోకి వస్తానంటే వెలక్‌మ్ అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?
ముద్రగడ దారెటు..?
Andhra Pradesh Politics: ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేత, సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఏ పార్టీలో లేరు, కానీ ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై హాట్ కామెంట్స్ చేసి కాక పుట్టించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి సపోర్ట్‌గా పవన్‌పై నిప్పులు చెరిగారు ముద్రగడ. దమ్ముంటే తనపై పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్‌కి సవాల్ విసిరారు. దాంతో ముద్రగడ పద్మనాభం మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావడం ఖాయమనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో జనసేన నుంచి కూడా ముద్రగడపై గట్టిగా కౌంటర్లు పడ్డాయి. వైసీపీ నుంచి పోటీ చేసేటట్లయితే వెంటనే టిక్కెట్ అనౌన్స్ చేయించుకోవాలని జనసేన ప్రతిసవాల్ విసిరింది.
ఇక కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న ముద్రగడ వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా..? లేక కాపులు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో తన అనుచరులతో చర్చిస్తున్నారా..? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..? వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు అటు వైసీపీ కూడా ముద్రగడపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ముద్రగడ మాటలు కూడా అలాగే కనిపిస్తున్నాయ్. వైసీపీ లీడర్స్ నుంచి ముద్రగడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముద్రగడ గొప్ప నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇవన్నీ చూస్తుంటే ముద్రగడ వైసీపీలో చేరతారేమోనన్న అనుమానాలు రేగుతున్నాయ్. అందుకు తగ్గట్టే వైసీపీ లీడర్స్ కామెంట్స్ కూడా ఉంటున్నాయ్.
గతనెల 9న కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికెళ్లి మరీ కలిశారు వైసీపీ నేతలు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిసి.. ముద్రగడతో చర్చలు జరిపారు. ఏం మాట్లాడారో తెలియదు గానీ, ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.