National News Networks

హస్తం పార్టీని కలవరపెడుతున్నఅంతర్గత పంచాయితీలు..

Post top

Ravi Malothu

Updated on: Jul 07, 2023 | 8:38 AM

కర్నాటకలో గెలిచామని కాలర్‌ ఎగరేశారు.తెలంగాణ లోనూ సత్తా చాటుతామని.. ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే వ్యవహారం వేరేలా కనిపిస్తోంది. గాంధీభవన్‌లో ఎంత జోష్‌ కనిపిస్తోందో.. అదే స్థాయిలో నిరసన గళం వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. ఇది, హస్తం పార్టీని గందరగోళంలోకి నెడుతోంది. అవును, మేమింతే అదో టైపు అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. పార్టీలో ఎంత జోష్‌ వచ్చినా.. మా జగడాలు మావే అంటున్నారు. కర్నాటకలో పార్టీ విజయం సాధించడం… మొన్నటి ఖమ్మం సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. ఇదంతా చూశాక ఇక పార్టీ గాడిన పడ్డట్టే అనుకున్నారంతా. అది నిజమే అన్నట్టుగా.. అటు బీజేపీ కాస్త చల్లబడితే.. ఇటు చేరికలతో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. గాంధీభవన్‌ మళ్లీ కళకళలాడుతోంది. అయితే, అదే స్థాయిలో అసంతృప్తుల గోల ఆరని చిచ్చులా కనిపిస్తోంది.

ఎంత జోష్‌ వచ్చినా… ఏం లాభం? ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. అదే స్థాయిలో అసమ్మతి గళానికీ వేదికవుతోంది గాంధీ భవన్‌. మునుగోడు కాంగ్రెస్‌ నేతలు.. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఎదుటే ఆందోళనకు దిగారు. మునుగోడు మండల కమిటీలన్నీ..చలిమల కృష్ణారెడ్డి వర్గానికే ఇచ్చారంటూ.. పాల్వాయి స్రవంతి వర్గం గాంధీభవన్‌లో బైఠాయించింది. పాల్వాయి స్రవంతి, కైలాష్ నేతలకి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌లో గందరగోళం ఏర్పడింది.

ఇదీ పాల్వాయి స్రవంతి చెప్పిన మాట. తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసంటూ పీసీసీకి స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు. పార్టీ ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. ఎన్నికల సమయమూ దగ్గరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మళ్లీ ఇలాంటి గొడవలు ముదురుతుండటం హస్తం పార్టీని కలవరపెడుతున్నాయి. ఇది కేవలం మునుగోడుకు సంబంధించిన గొడవ మాత్రమే. తరిచి చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు.. ఎప్పుడు

ఎంత జోష్‌ వచ్చినా… ఏం లాభం? ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. అదే స్థాయిలో అసమ్మతి గళానికీ వేదికవుతోంది గాంధీ భవన్‌. మునుగోడు కాంగ్రెస్‌ నేతలు.. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఎదుటే ఆందోళనకు దిగారు. మునుగోడు మండల కమిటీలన్నీ..చలిమల కృష్ణారెడ్డి వర్గానికే ఇచ్చారంటూ.. పాల్వాయి స్రవంతి వర్గం గాంధీభవన్‌లో బైఠాయించింది. పాల్వాయి స్రవంతి, కైలాష్ నేతలకి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌లో గందరగోళం ఏర్పడింది.

పాల్వాయి స్రవంతి చెప్పిన మాట…

తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసంటూ పీసీసీకి స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు. పార్టీ ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. ఎన్నికల సమయమూ దగ్గరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మళ్లీ ఇలాంటి గొడవలు ముదురుతుండటం హస్తం పార్టీని కలవరపెడుతున్నాయి. ఇది కేవలం మునుగోడుకు సంబంధించిన గొడవ మాత్రమే. తరిచి చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు.. ఎప్పుడు భగ్గుమంటాయోనన్న ఆందోళన కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.