GANGADHAR RAO KARAM
POLITICAL DESK
Updated on: Jul 07, 2023 | 8:01 AM
విశాఖ కు షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వల్ల విశాఖ జిల్లా లో వైసీపీ ఎంతవరకూ బలపడింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. వైవీ సుబ్బారెడ్డి ఒక చోట ఉండేవారు కాదు. ఆయన కు టీటీడీ చైర్మన్ పోస్టు ఉంది. అందువల్ల తిరుపతి లో ఉండాలి. నివాసం ఒంగోలు – హైదరాబాద్ లో ఉంది. పార్టీ ఆయన కు అప్పగించిన బాధ్యతలు విశాఖ లో ఉన్నాయి.దాంతో వీలు చిక్కినపుడల్లా ఆయన విశాఖ వచ్చి పోతూ ఉంటారు. ఆయన వస్తున్నారు అనగానే పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. వైవీ సుబ్బారెడ్డి గారు వస్తున్నారు. విమానాశ్రయాని కి వచ్చే వారు ఎవరూ దయచేసి శాలువాలు తీసుకుని రావద్దు అన్నది రొటీన్ విన్నపంగా ఉంటోంది. అలా వైవీ విశాఖ వస్తున్నారు అని తెలుస్తుంది అన్న మాట.
తాజాగా విశాఖ వచ్చిన వైవీ సుబ్బారెడ్డికి మరోసారి ఆయన ఇదే విషయం విన్నవించినట్లుగా తెలుస్తోంది. విశాఖ తూర్పులో అభ్యర్ధి ఎవరో ఇంకా వైసీపీ డిసైడ్ చేయలేదు. ఈ సీటు ని విశాఖ మేయర్ హరి వెంకట కుమారి తో పాటు వీమ్మేఅర్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ ఆశిస్తున్నారు. తూర్పులో మూడు ముక్కలాట సాగుతోంది. దీన్ని సరిచేసే ప్రయత్నం అయితే లేదు అని అంటున్నారు.గాజ్వాక పెందుర్తిలలో పార్టీ వీక్ గా ఉందని అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యేల మీద సొంత పార్టీ లోనే అసంతృప్తి ఉందని అంటున్నారు. దీని విషయం లో రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి సమీక్ష చేయాల్సి ఉందని అంటున్నారు. ఎలమంచిలి లో మంత్రి అనుచరులు వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వివాదం సాగుతోంది. అలాగే పాయకరావుపేట లో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ సొంత పార్టీ నేతలు గా కధ అలా సాగుతూనే ఉంది. అదే విధంగా ఎస్ కోట నియోజకవర్గం లో వర్గ పోరు పీక్స్ కి చేరింది అని అంటున్నారు.ఇవన్నీ కూడా వైవీ సమీక్షించి తగిన విధంగా పార్టీని దారి లో పెట్టాల్సి ఉందని అంటున్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి షటిల్ సర్వీస్ చేయడం వల్ల అయితే పార్టీ బలో పేతం కావడం కష్టమని అంటున్నారు. ఆయన కు బాధ్యతలు కూడా ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యం లో బాబాయ్ విశాఖ వైపే చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.