‘రంగరంగ వైభవంగా’ నుంచి ఫస్టు సింగిల్ రెడీ!
‘ఉప్పెన’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీతోనే హీరోగా వైష్ణవ్ తేజ్ పరిచయమయ్యాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకి కేతిక శర్మ పరిచయమైంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో లవ్ స్టోరీనే ‘రంగరంగ వైభవంగా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది.
బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన స్వరపరిచిన ఒక పాటను ఫస్టు సింగిల్ గా వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 3వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్ కానుంది. ‘తెలుసా .. తెలుసా’ అంటూ ఈ పాట కొనసాగనుంది.
కేతిక శర్మకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఆమె చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలోను ఆమె అంతకుమించి అన్నట్టుగా అందాలు ఆరబోయనుందనే టాక్ వినిపిస్తోంది.