ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలు పై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలి
24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలు ను ప్రారంబించాలి. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీస్కొని రైతులకు భరోస కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టిఆర్ఎస్ నేతలను అడ్డుకుంటాం..
మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలి. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి..ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టిఆర్ఎస్ లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలి.రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలి.రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుంది.. రేవంత్ రెడ్డి..