National News Networks

విడోగా .. హంతకురాలిగా ఆసక్తిని రేపుతున్న లుక్ తో కీర్తి సురేశ్!

Post top
  • ‘సర్కారువారి పాట’ను పూర్తిచేసిన కీర్తి సురేశ్
  • మే 12వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల
  • షూటింగు దశలోనే నానీతో చేస్తున్న ‘దసరా’ సినిమా 
  • తమిళంలో కీర్తి సురేశ్ చేసిన ‘సాని కాయిధం’ అమెజాన్ ప్రైమ్ లో  
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆమె అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో ‘సాని కాయిధం’ సినిమా చేసింది. కీలకమైన పాత్రలో సెల్వ రాఘవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటే, అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను వదులుతున్నట్టుగా ప్రకటించారు. 
అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాను మే 6వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, నిన్ననే తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో కీర్తి సురేశ్ విడోగా .. హంతకురాలిగా కనిపిస్తోంది. పోలీస్ విచారణలో తాను 24 మర్డర్స్ చేసినట్టుగా చెప్పడం .. వరుస మర్డర్లు చేయడం చూపించారు. ఎందుకు ఆమె అంతలా హత్యలు చేస్తూ వెళుతుందనేది సస్పెన్స్.

ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఓటీటీలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయేలానే కనిపిస్తోంది. ఇక తెలుగులో కీర్తి సురేశ్ తాజా చిత్రంగా ‘సర్కారువారి పాట’ మే 12 వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇక నానీతో చేస్తున్న ‘దసరా’ సెట్స్ పై ఉంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.