National News Networks

చరిత్ర తిరగ రాస్తారట, సలహాలు ఇవ్వొచ్చు

Post top

మన పిల్లలకు తెలియని చరిత్ర పాఠాలు త్వరలో రాబోతున్నాయి. ఆ తప్పులను సరిచేస్తున్నారు..
భారత చరిత్రలోని అన్ని కాల వ్యవధులకు సరియైన, సమానమైన రెఫరెన్స్‌లను ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు మన దేశ వీరనారులు గార్గి, మైత్రేయి, ఝాన్సీ రాణి, రామచన్నమ్మ, చాంద్ బీబీ, జల్కారీ భాయ్‌ కథలను చరిత్ర పాఠాలాల్లో హైలైట్ చేయాల్సిందిగా తెలిపింది. స్కూల్ పుస్తకాల్లో మారనున్న చరిత్ర పాఠాలు. గతంలో జరిగిన కొన్ని  తప్పులను సరిచేస్తున్నారు.
చిన్నప్పుడు స్కూల్‌లో చరిత్రను అందరూ చదివే ఉంటారు. మన దేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? ఎప్పుడు ఎవరి పాలనలో ఉండేది? ఏయే రాజులు పాలించారు? ప్రాచీన కాలంలో ప్రజల జీవిన విధానం ఎలా ఉండేది? ఇప్పుడున్న ప్రాంతాలు అప్పట్లో ఎలా ఉండేవి? ఇలా ఎన్నో అంశాల గురించి చదువుకున్నాం. ఐతే చరిత్ర పాఠాల్లో తప్పులు ఉన్నాయని, చరిత్ర వక్రీకరణ జరిగిందని అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చరిత్ర పాఠ్యాంశాల్లో తప్పుల సవరణపై పార్లమెంటరీ విద్యాశాఖ కమిటీ దృష్టిపెట్టింది. అంతేకాదు భారత చరిత్రలో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలని యోచిస్తోంది. బీజేపీ ఎంపీ వినయ్ సహస్ర బుద్దే ఈ పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. స్కూల్ చరిత్ర పుస్తకాల్లో మనదేశం గురించే మొదటగా ఉండాలని, 1975 ఎమర్జెన్సీ, 1998లో పొఖ్రాన్ అణుపరీక్షలు వంటి అంశాలను చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చరిత్ర పాఠ్యాంశాల్లో ఉన్న తప్పుల సవరణ, కొత్తగా చేర్చే అంశాలకు సంబంధించి ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలను సేకరిస్తున్నారు.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు జూన్ 20 వరకు గడువు ఉండేది. ఐతే కరోనా నేపథ్యంలో చాలా మంది తమ విలువైన సూచనలను ఇవ్వలేకపోయారు. మరికొన్ని రోజుల పాటు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు రావడంతో… జులై 15 వరకు గడువును పొడిగిస్తూ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. చరిత్ర పుస్తకాల్లో తప్పుల సవరణ, కొత్త పాఠ్యాంశాలకు సంబంధించి రిపోర్టు ఇప్పటికే దాదాపుగా సిద్ధమైంది. కానీ సలహాలు, సూచనలను అందించేందుకు గడువును పొడిగించాలని కొందరి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలోనే గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు కమిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంతో కీలకమైన ఈ కార్యక్రమంలో అందరి అభిప్రాయాలను తీసుకోవాలన్నదే తమ అభిమతని వెల్లడించాయి.

భారత చరిత్రకు వాస్తవ దూరంగా ఉన్న రెఫరెన్స్‌లతో పాటు మన దేశ హీరోల జీవిత గాథలను వక్రీరించిన పాఠాలను తొలగిస్తూ స్కూల్ పాఠ్యాంశాల్లో సంస్కరణలు తేవాలని రాజ్యసభ సెక్రటేరియెట్ జారీ చేసిన గత నోట్‌లో పేర్కొన్నారు. భారత చరిత్రలోని అన్ని కాల వ్యవధులకు సరియైన, సమానమైన రెఫరెన్స్‌లను ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు మన దేశ వీరనారులు గార్గి, మైత్రేయి, ఝాన్సీ రాణి, రామచన్నమ్మ, చాంద్ బీబీ, జల్కారీ భాయ్‌ కథలను చరిత్ర పాఠాల్లో హైలైట్ చేయాల్సిందిగా తెలిపింది. చరిత్ర పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి జులై 15 లోగా హిందీ లేదా ఇంగ్లీష్‌లో మెయిల్ పంపించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు పార్లమెంటరీ కమిటీ సూచించింది. కొన్ని వర్గాలకు చెందిన చరిత్రకారులు ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రకు వాస్తవ దూరంగా ఉన్న రెఫరెన్స్‌లతో మన దేశ చరిత్రను వక్రీకరించారని బీజేపీ ఎంపీ, విద్యాశాఖ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ వినయ్ సహస్రబుద్దే ఆరోపిస్తున్నారు. వాటన్నింటినీ సవరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.