విశాఖపట్టణం, ఏప్రిల్ 15:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది.. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీతో ఒక్కసారిగా హీట్ పెరిగింది.. ఆ వెంటనే కేంద్రం కూడా తాత్కాలికంగా ఈ వ్యహారంలో వెనక్కి తగ్గింది.. కానీ, ఆ క్రెడిట్ కొట్టేసేందుకు అంతా పోటీ పడుతున్నారు.. అదే సమయంలో.. పార్టీల స్టాండ్‌పై కూడా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఢిల్లీలో మేం పోరాటం చేస్తున్నాం.. కానీ, బీఆర్ఎస్, జనసేన తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు..రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు.. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.. భావనపాడు పోర్ట్ ని టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది అని నిలదీసిన ఆయన..
మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవు అని హెచ్చరించారు.. మరోవైపు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఒక ఉన్మాది హత్యా యత్నానికి పాల్పడ్డాడు… నిందితుడు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడు అని విచారణ జరగాలన్నారు.. చంద్రబాబుపై అలిపిరిలో హత్యాయత్నం జరిగింది. అంటే అప్పుడు సానుభూతి కోసం ఆ ఘటన జరిపించుకున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోడి కత్తి ఘటనలో కొన్ని పత్రికల వార్తలు నీచమైనవి అని మండిపడ్డారు. నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ.. తెలుగుదేశం మద్దతు దారుడు అవునా? కాదా..? అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారని ఫైర్ అయ్యారు.