టీ న్యూస్ చానల్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘టీ న్యూస్ తెలుగుకు ఇది అద్భుతమైన పుష్కరం. మీ అపరిమితమైన ప్రేమ, ఆప్యాయత లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఉత్తమమైన సమాచారాన్ని అందించడానికి మమ్ములను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ టీన్యూస్ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’అని ట్వీట్ చేశారు.