National News Networks

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Post top

హైద్రాబాద్ (మిణుగురు ప్ర‌తినిధి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళ అంశం పై సిబిఐ విచారణ జ‌రిపించాలని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ వ్రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం, టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర పై సీబీఐ విచారణకు చేయించాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవక తవకలు, బియ్యం రీ సైక్లింగ్ పై తక్షణం సీబీఐ విచారణ చేయాలని లేఖ లో పేర్కోన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్ సీఐకి చేసిన సప్లై, గాయబ్ అయిన బియ్యం నిల్వలు, అన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరిపించాల‌న్నారు.

రేవంత్ రెడ్డి. బాధ్యులైన మిల్లులను సీజ్ చేసి… రెవెన్యూ రికవరీ యాక్టు కింద జరిగిన దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలని,రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యుల పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.టీఆర్ఎస్ పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదు. తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండని లేఖ‌లో రేవంత్ రెడ్డి పేర్కోన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.