- జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
- నివాళి అర్పిస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రధాని
- ఫొటోలో మోదీ వెనుక నిలబడ్డ అరుణ్ జైట్లీ, రామ్ నాయక్
పొరపాటున పెట్టిన ఒక ఫోటో దేశ ప్రధాని నరేంద్ర మోదీని నవ్వులపాలు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మోదీ ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టారు. ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో కానీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చాలా గొప్పవని అన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. మోదీ నివాళి అర్పిస్తున్న ఫొటో మాత్రం ఆయనను నవ్వులపాలు చేసేలా ఉంది. మోదీ నివాళి అర్పిస్తున్న సమయంలో ఆయన వెనుక దివంగత అరుణ్ జైట్లీ, రామ్ నాయక్ నిలబడి ఉన్నారు. జగ్జీవన్ రామ్ కు నివాళి అర్పించడానికి మోదీతో పాటు జైట్లీ, రామ్ నాయక్ కూడా వచ్చారంటూ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఆ ట్వీట్ ను మోదీ ఇంత వరకు తొలగించలేదు.