- వడ్లు కొనే వరకు ఉద్యమం తప్పదు
- టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి
(మిణుగురు-మేడ్చల్ జిల్లా) : తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్ తో సోమవారం నాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దేశ రాజధాని డిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన “వరీ దీక్ష” కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి,డిప్యూటీ మేయర్ కొత్త లక్మ్షీ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్న భూముల స్వభావ రీత్యా వడ్లు అత్యధికంగా పండుతాయని ఏటా కేంద్రమే వడ్లను కొనుగోలు చేస్తుందని కానీ ఈ సారి తెలంగాణపై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్ ను బద్నాం చేసేందుకు రైతులపై పగసాధించేలా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. పంజాబ్ లో ఏ విధంగానైతే వడ్లు కొనుగోలు చేస్తున్నారో అదే విధంగా తెలంగాణ లో కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.