National News Networks

బీసీలకు తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హతలు, నిబంధనలు ఇవే!

Post top
  • వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు ఆర్థికసాయం
  • ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
  • పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థికసాయం

వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందించబోతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమయింది. ఈ నెల 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి గంగుల తెలిపారు. 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి మార్గదర్శకాలు:

లబ్ధిదారులు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులై ఉండాలి.

వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలకు మించి ఉండకూడదు.

పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే నిధులు అందిస్తారు.

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.

గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక సాయం పొంది ఉండకూడదు.

2017-18లో రూ. 50 వేల ఆర్థికసాయం పొందినవారు కూడా అనర్హులు.

వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలి.

మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.

ఎంపికైన లబ్ధిదారులను ఆన్ లైన్ లో ప్రకటిస్తారు. 

ఎంపికైన వారి బ్యాంకు ఖాతాకు నేరుగా ఆర్థికసాయాన్ని జమ చేస్తారు. ఆర్థికసాయం పొందిన నెలలోగా పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.