భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రమా యాత్ర-2 పాదయాత్ర లో పాల్గొనడానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బుధవారం రోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా బండి సంజయ్ పాదయాత్ర కు బయల్దేరిన ప్రహ్లాద్ సింగ్ పటేల్ సాయంత్రం తిరుగు ప్రయాణంలో తొండూ పల్లి లోని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ మిత్రుడి గెస్ట్హౌస్ కు చేరుకున్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు బిజెపి రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఢిల్లీకి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్ పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.