ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
బద్వేలు:బద్వేలు నియోజకవర్గం లో ముస్లింలకు వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జరగబోయే రంజాన్ ముస్లింలలో ఆనందం నింపాలని వారు కోరారు.
దాదాపు నెలరోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉండి ముస్లింలు రంజాన్ పండగను చేసుకుంటున్నారని వారు అన్నారు. రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాలలో సంతోషం కలిగించాలని వారు కోరుకున్నారు. ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ ముస్లింలకు కొత్త భవిష్యత్తుకు నాంది కావాలని వారు కోరారు.
