National News Networks

10 వేలు దాటిన తెల్ల బంగారం AP

Post top

కర్నూలు, ఫిబ్రవరి 8: పత్తి ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో పత్తి ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది. పత్తి వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీని కారణంగానే పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉ బళ్లారి, రాయచోటి తదితర ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని కాటన్ మార్కెట్ లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరిగాయి. క్వింటాల్ పత్తి ధర పదివేల రూపాయలు దాటి రూ. 10,759 పలికింది. సీజన్ చివరి దశకు చేరుకుంటుండటం.. వ్యాపారుల మధ్య పోటీ పెరగడం, సప్లై తగ్గి డిమాండ్ పెరగడం కారణంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో కరువు సీమలో రైతుకు కొంత ఊరట కలిగిస్తోంది.

పత్తికి భారీ స్థాయిలో ధర పలుకుతుండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ సీజన్‌లో పత్తి దిగుబడులు బాగా తగ్గాయి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా పత్తికి అనూహ్యంగా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదోని మార్కెట్‌లో పత్తికి రికార్డ్‌ స్థాయిలో ధర పలికింది. దీంతో పత్తి పండించే రైతులకు మంచి రోజులు వచ్చాయంటూ మురిసిపోతున్నారు రైతులు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ధర పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లకు, గింజలకు మంచి డిమాండ్ ఉండటంతో పోటీ పడి మరీ ఎంత ధరకైనా పత్తిని కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. వారం నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ పత్తి 8,500 రూపాయల నుంచి రూ. 10 వేలు దాటింది. ఇలానే కొనసాగితే క్వింటా పత్తి ధర 11 వేలకు చేరే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు అధికారులు.2

Post bottom

Leave A Reply

Your email address will not be published.