- 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం
- ఇటీవల నిధుల జాబితాను విడుదల చేసిన ఎన్డీఆర్ఎఫ్
- ఆ జాబితాలో తెలంగాణ పేరు లేదని కవిత విమర్శ
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రాలకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ విడుదల చేయగా, ఆ జాబితాను కవిత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో తెలంగాణ పేరు లేదని చెప్పారు.
బీజేపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. హైదరాబాద్ ప్రజలకు వరద సాయం అందించడంలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. వరదల సమయంలో బాధితులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆదుకోలేదని, ప్రతి అంశంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరిస్తోందని కవిత దుయ్యబట్టారు.
Related Posts
[ePaper nr=1]