హైద్రాబాద్( మిణుగురు ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది.
ఇదే సమయంలో పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు సైతం ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటించింది.