శ్రీకాకుళం:వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని జెండా ఎగురు వేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 1985లో జరిగిన ఎన్నికలలో తొలిసారి తనకి అభ్యర్థిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తొలి ఎన్నికల్లోనే తనకు 35000 పైచిలుక మెజార్టీ వచ్చిందని ఇది రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీ అని ప్రత్యర్థి కూడా ప్రముఖులే అని అయినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ సత్తాన్ని నిరూపించారని ఇది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన కొద్ది నియోజకవర్గాల్లో ఇదిఒకటి అని తెలియజేశారు.
ఈ విజయం నా వ్యక్తిగత ఖాతాలో వేసుకోనని అది తెలుగుదేశం పార్టీ బలమని అదే విషయం ప్రస్తుత వైసిపి నాయకులు ధర్మాన ప్రసాద్ రావు కూడా అనేక సందర్భాల్లో తన కార్యకర్తలకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయని తెలియజేశారు. ఇదే విషయం నిన్న శ్రీకాకుళం కేంద్రానికి సమీపంలో ఉన్న పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రలపేట లో నాకెప్పుడూ మెజార్టీ రాలేదు అనడం వెనుక తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనే భావనగా అర్ధం చేసుకోవచ్చు.ఈ విజయ పరంపర 20 ఏళ్ళు కొనసాగిందని అయితే పార్టీలో గ్రూపులు పెట్టడం వలన నేను రాజకీయంగా మరుగున పడ్డానని తెలియజేశారు.
ఇదే నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేసిన సందర్భంలో గుండ లక్ష్మీదేవి ధర్మాన ప్రసాదరావు మీద సుమారు 25000 మెజార్టీతో గెలిచిన సందర్భం ఉందని అందుకే సంయమనంగా మా దంపతులు వ్యవహరిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరము అందుకే అందరూ కలిసి పనిచేయవలసి ఉండడం వలన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం చంద్రబాబునాయుడు అని గుండ దంపతులు తెలియజేశారు. ఇకనుండి సంయమనం పాటించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.