National News Networks

శ్రీశైలంలో వైకాపా నేతల రౌడీయిజం

Post top

బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు
విజయవాడ: సిఎం జగన్మోహన్ రెడ్డి కి రజాక్, వైసిపి నేత శిల్పా చక్రపాణి రెడ్డి అక్రమాల పై లేఖ రాశాను. శ్రీశైలం లో శివలింగం తవ్వే ఫొటోలలో రజాక్ ఉన్నాడు. కాంట్రాక్టు కూడా రజాక్ దే అయినా… రికార్డు లు వేరే వారి పేరుతో తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అధికారులు, ఇఒ లు రజాక్ కనుసన్నల్లో పని చేస్తున్నారు. టిడిపి, వైసిపి నేత లే రజాక్ ను వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఓట్ల రాజకీయాల కోసం పార్టీ లు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నాయి. అన్నీ రజాక్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి… ఆయన అనుమతి తోనే అన్నీ జరుగుతాయి. మా బిజెపి నేత శ్రీకాంత్ రెడ్డి ఈ అన్యాయాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు. చక్రపాణి రెడ్డి ఏకంగా మా నాయకుడి పై దాడికి ప్రేరేపించారు. ప్రాణ భయంతో శ్రీకాంత్ రెడ్డి పోలీస్టేషన్ లో తలదాచుకున్నారు. అయినా శ్రీకాంత్ రెడ్డి పై14 ఫాల్స్ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేశారు. దాడి చేసిన వారు, చేయించిన వారి పై కేసులు లేవు. జగన్ చెప్పుచేతల్లో పని చేసిన డిజిపి ని పంపించేశారు. ఇప్పుడు పోస్టింగ్ కూడా లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారని అన్నారు.

గతంలో యల్వీ సుబ్రహ్మణ్యం ను ఇలాగే సాగనంపారు. అధికారులు తెలుసుకోండి… అవసరం తీరితే.. మీ పరిస్థితి అయినా ఇంతే. ప్రభుత్వ వైఖరి ఇనిస్టిబిలిటీ గా ఉంటే అధికారులు ఎలా పని చేస్తారు. చక్రపాణి రెడ్డి గతంలో, ఇప్పుడు ప్రభుత్వం అండతో అరాచకాలకు పాల్పడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి వైద్యులు, సంఘంలో పేరున్న వ్యక్తి. రజాక్ రౌడీయిజంతో .. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏదో రజాక్ ను అరెస్టు చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి. ఈ అంశాలను వివరిస్తూ సిఎం కు లేఖ రాశాను. ఆయన సానుకూలంగా స్పందించి వైసిపి నేతల అరాచకాలను కట్టడి చేయాలని అయన అన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.